మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ సూచించారు. సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళలు, ట్రాన్స్ జెండర్లు, మహిళా కానిస్టేబుళ్లకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో ట్రాన్స్ జెడర్లను ప్రత్యేకంగా గౌరవించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో మహిళా కానిస్టేబుల్స్‌ను గౌరవించాలని సూచించారు. మహిళలకు ఎటువంటి సమస్యలు వచ్చినా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ముందుండి, వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ట్రాన్స్ జెండర్స్, అంగన్‌వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
కోదాడ డీఎస్పీగా శ్రీనివాసరెడ్డి బాధ్యతల స్వీకరణ
కోదాడ: కోదాడ సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్(డీఎస్పీ)గా ఆర్. శ్రీనివాసరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీరించారు. కోదాడ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇప్పటి వరకు ఇక్కడ డీఎస్పీగా పనిచేసిన శ్రీధర్‌రెడ్డి నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఇక్కడ పనిచేసిన శ్రీధర్‌రెడ్డి బదిలీపై హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖకు వెళ్లిన విషయం విదితమే.
పిల్లల్లో క్రీడా
నైపుణ్యాన్ని గుర్తించాలి
సూర్యాపేట టౌన్ : పిల్లల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. సూర్యాపేట పట్టణానికి చెందిన రాడికల్ చెస్ అకాడమీ విద్యార్థిని మాస్టర్ ఇందిర జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికై న సందర్భంగా చెస్ అకాడమీ నిర్వాహకులు అనిల్ కుమార్ విద్యార్థులతో కలిసి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ వారిని అభినందించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లాకు పేరు తేవాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని, నైపుణ్యం ఉన్న రంగంలో ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
గరిడేపల్లి: చిన్నపిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డాక్టర్ కోటిరత్నం సూచించారు. మంగళవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ నరేష్, వీసీసీఎం లతీఫ్ పాల్గొన్నారు.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
సూర్యాపేట టౌన్ : సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్.సోమయ్య కోరారు. సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరుతూ మంగళవారం టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రికి ఈ మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కె. అరుణ భారతి, జిల్లా కార్యదర్శి వెలుగు రమేష్, చిలక రమేష్, ధరావత్ లాలు, సీహెచ్.వీరారెడ్డి, బి.పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి


