ధాన్యం తూకంలో అవకతవకలు
అనంతగిరి: ధాన్యం తూకంలో కేంద్రాల నిర్వాహకులు అవకతవకలకు పాల్పడుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అనంతగిరి మండలంలోని అనంతగిరి, శాంతినగర్, ఖానాపురం కేంద్రాల్లో ప్రతి బస్తాకు తూకం 40కేజీల500గ్రాములు వేయాల్సి ఉండగా 41కేజీల200 గ్రాములు వేస్తున్నట్లు రైతులు తెలిపారు. ప్రతి బస్తాకు 700గ్రాముల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. దీనిపై నిర్వాహకులను వివరణ కోరగా కొందరు 41 కేజీలు మాత్రమే వేస్తున్నామని, మరికొందరు తమకేమీ తెలియదని చెప్పారు. బస్తాకు 41కే జీల200 గ్రాములు తూకం వేస్తున్నట్లు హమాలీలు తెలపడం గమనార్హం. ఖానాపురంలో రైతులు ఽతెచ్చింది కాకుండా దళారులు తెచ్చిన ధాన్యాన్ని తూకం వేసేందుకు నిర్వాహకులు ప్రాధాన్యమిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోలులో అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఫ బస్తాకు 41కేజీల 200గ్రాములు తూకం వేస్తున్న నిర్వాహకులు
ఫ అదనంగా 700గ్రాములు స్వాహా


