
రాత్రి అయితే దోమలతో జాగారమే..
సూర్యాపేటలోని స్నేహనగర్ కాలనీలో ఖాళీ ప్లాట్లలో వర్షం నీరు చేరి దోమలు వృద్ధి చెందుతున్నాయి. దోమలు చుట్టుపక్కల ఇళ్లలోని వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సాయంత్రం అయిందంటే చాలు దోమలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కాలనీలో పలువురు జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరారు.
– కనకటి రవి, స్నేహనగర్ కాలనీ
వర్షాకాలం ప్రారంభం కావడంతో దోమల బెడద అధికమైంది. ఇప్పటి వరకు కోదాడలో దోమల నివారణకు మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇళ్ల మధ్య మురుగునీరు నిలవడం ప్రధాన సమస్యగా ఉంది. ఫాగింగ్ చేసి దోమల బెడదను నివారించాలి.
– ఈదుల కృష్ణయ్య, కోదాడ

రాత్రి అయితే దోమలతో జాగారమే..

రాత్రి అయితే దోమలతో జాగారమే..