
ఫ పర్యావరణ హితం.. మా అభిమతం
సీపీఎస్‌ను రద్దు చేయాలి
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల దేవరాజ్ డిమాండ్ చేశారు. వచ్చేనెల 1న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలో ఆవిష్కరించి మాట్లాడారు. సీపీఎస్ వల్ల ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మధు కుమార్, రవీందర్ , చౌదర్ రెడ్డి, రాజశేఖర్, లింగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.