
బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు మేలు
చివ్వెంల(సూర్యాపేట) : బోధన, అభ్యసన మేళాతో విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. మంగళవారం చివ్వెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండలస్థాయి బోధన అభ్యసన పరికరాల ప్రదర్శనను సందర్శించారు. మండల వ్యాప్తంగా ఉన్న 37 పాఠశాలల ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. బోధన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మండల స్థాయి ప్రదర్శనలో 1నుంచి 5 వతరగతి వరకు ప్రాధమిక స్ఠాయి బోధన కోసం తయారు చేసిన పరికరాల్లో ఉత్తమమైనవి ఎంపిక చేసి జిల్లా స్థాయి మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ కళారాణి కలెక్టర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సంతోష్ కుమార్, తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్