మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Aug 16 2025 8:35 AM | Updated on Aug 16 2025 8:35 AM

మహిళల

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

చివ్వెంల : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడారు. మహిళల కోసం తెచ్చిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసిన యూట్యూబ్‌, ఇన్‌స్ట్రాగామ్‌లను ప్రారంభించారు. అనంతరం బధిరుల పాఠశాలకు చెందిన మూగ విద్యార్థి చేసిన యోగాసనాలు, బాలసదన్‌ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారికి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి ఫర్హీన్‌ కౌసర్‌, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి గోపు రజిత, సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ బి.వెంకటరమణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

అధ్యాపకుల కృషితోనే అడ్మిషన్లు పెరిగాయి

నేరేడుచర్ల : అధ్యాపకుల కృషితోనే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లు పెరిగాయని జిల్లా ఇంటర్మీడియట్‌ బోర్డు విద్యాధికారి(డీఐఈఓ), నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ భానునాయక్‌ అన్నారు. శుక్రవారం నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఉత్తమ విద్యార్థులలకు బహుమతుల ప్రదానం చేసి మాట్లాడారు. ఈ కళాశాలలో పనిచేసి రిటైరైన రామానుజాచార్యులు జ్ఞాపకార్థంగా ఆయన సతిమణీ మంగతాయారు ఉత్తమ మార్కులు సాధించిన పలువురు విద్యార్థులకు రూ.2,500 చొప్పున లయన్స్‌క్లబ్‌ ద్వారా నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షుడు గున్‌రెడ్డి, సైదిరెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి, కార్యదర్శి యూసుఫ్‌, సభ్యులు విశ్వనాథం, నాగేశ్వర్‌రావు, వెంకటేశ్వర్లు, అధ్యాపకులు వెంకటరమణ, మద్దిమడుగు సైదులు, ప్రణతి, శ్రీనివాసులు, వెంకన్న, నరేందర్‌, అంజయ్య, నర్సింహాచారి తదితరులు పాల్గొన్నారు.

ఐదు గేట్ల ద్వారా

‘పులిచింతల’ నీటి విడుదల

మేళ్లచెరువు : చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం రాత్రి వరకు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి 1,55,464 క్యూసెక్కుల వరద వస్తుండగా ఐదు గేట్లను నాలుగు మీటర్ల మేర పైకి ఎత్తి 1,67,130 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ నాలుగు యూనిట్ల ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
1
1/2

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
2
2/2

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement