
గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించాలి
భానుపురి : గ్రంథాలయాల అభివృద్ధికి ప్రతిఒ క్కరూ సహకరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. సూర్యాపేటలో రూ.1.5 కోట్ల వ్యయంతో చేపడుత్ను గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. భావితరాలకు మంచి విద్యను అందజేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలో మౌలిక వసతుల కల్పనకు మరో కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు. ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి అదనంగా మరో రూ.కోటి మంజూరు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, మందుల సామేల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు చెవిటి వెంకన్న యాదవ్, గ్రంథాలయాల సెక్రటరీ బాలమ్మ పాల్గొన్నారు.