
ప్రజా సంక్షేమమే ధ్యేయం
తొలి విడతగా 12,868 ఇళ్లు మంజూరు
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
భానుపురి (సూర్యాపేట) : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన 79వ స్వాతంత్య్ర వేడుకలకు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ కె.నరసింహతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. అహింసే అస్త్రంగా మహా సంగ్రామాన్ని గెలిచి ప్రపంచానికి సరికొత్త పోరాట పంథాను పరిచయం చేసిన ఘనత భారత దేశానికే దక్కిందన్నారు. ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 3.48 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారని పేర్కొన్నారు. తద్వారా రూ.191.78 కోట్లు ఆదా చేసుకున్నారని తెలిపారు. రూ.500లకే గ్యాస్ పథకం కింద జిల్లాలో 4,05,898 మంది వినియోగదారులకు 5,52,043 సిలిండర్లు పంపిణీ చేసి సబ్సిడీ కింద రూ.15.26 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రేషన్ పంపిణీ చేస్తున్న డీలర్లకు ఇక నుంచి ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో కమీషన్ సొమ్మును ప్రతినెలా జమ చేస్తుందని స్పష్టం చేశారు.
పేదలకు ఆహార భద్రత కల్పించాం
పేదలకు ఆహార భద్రత కల్పించామని, ఇందుకోసం గత ఉగాది నుంచి సన్నబియ్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 3,26,057 రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేదల ఆత్మగౌరవానికి మరో ప్రతీకగా నిలిచే రేషన్ కార్డులను పదేళ్ల తర్వాత అర్హులందరికీ ఇచ్చామన్నారు. కొత్తగా జిల్లాలో 36,812 కార్డులు మంజూరు చేయడమే కాకుండా 70,932 మంది సభ్యుల పేర్లను చేర్చినట్లు తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించి పరిమితులు లేకుండా ప్రతి రైతుకు సాయం చేశామని చెప్పారు. ఈ పథకంలో 2,87,234 మంది రైతుల ఖాతాల్లో రూ.366.50 కోట్లు నిధులు జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పధకం కింద జిల్లాలో 2024–25లో మృతిచెందిన 817 మంది రైతుల నామినీలకు రూ.35 కోట్లను చెల్లించామని తెలిపారు. సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు రైతులకు క్వింటాకు రూ.500ల చొప్పున బోనస్ చెల్లించి సన్నవడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేసిందన్నారు.
ఎత్తిపోతలకు అధిక నిధులు
జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇరిగేషన్ శాఖ ద్వారా జిల్లాలో తక్కువ ఖర్చుతో లిఫ్టులు నిర్మించి ఎక్కువ ఆయకట్టు సాగులోకి తెచ్చామన్నారు. జిల్లాలో మొత్తంగా 5,85,464 ఎకరాల ఆయకట్టు ఉందని, ఎత్తిపోతల పథకాలకు రూ.కోట్లాది నిధులు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆధునీకరణ పనుల్లో భాగంగా లైనింగ్ పనులకు రూ.29 కోట్లు, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్‌కు రూ.184.60, , జాన్‌పహాడ్ మేజర్ లైనింగ్ పనులకు రూ.52.11 కోట్ల చొప్పున మంజూరు చేశామన్నారు. ఇవేకాకుండా మూసీ కాలువల ఆధునీకరణ పనులను చేపడుతున్నామని, చెక్‌డ్యామ్‌లనిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగేలా చేస్తున్నామని తెలిపారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరిచ్చి రెండు సీజన్లలో పంటలు పండేలా చేసి తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో టీజీ ఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్, వైష్ణవి పాఠశాల, బాల భవన్, జెడ్పీహెచ్‌ఎస్ చివ్వెంల విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. విద్యార్థులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభినందించి వారితో ఫొటోలు దిగారు. అనంతరం పలువురికి బహుమతులు అందించారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
స్వాతంత్య్ర సమర యోధులను సన్మానిస్తున్న మంత్రి ఉత్తమ్
తొలి విడతగా జిల్లాలో 12,868 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా 1,050 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటికి రూ.22 కోట్లను లబ్దిదారులకు చెల్లించామన్నారు. విద్యాపరంగా కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఒక్కోటి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే కోదాడకు జవహర్ నవోదయ విద్యాలయం, హుజూర్‌నగర్‌కు వ్యవసాయ కళాశాల మంజూరు చేయించినట్లు తెలిపారు.
స్వాతంత్య్ర సమరయోధులైన గరిడేపల్లికి చెందిన గంట లక్ష్మారెడ్డి, నడిగూడెంకు చెందిన భిక్షమయ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్, పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత
ఫ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలాంటివి
ఫ ఇక నుంచి రేషన్ డీలర్లకు నేరుగా కమీషన్ డబ్బులు
ఫ 79వ స్వాతంత్య్ర వేడుకల్లో
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ధ్యేయం