
కూలిన గుండ్లసింగారం బ్రిడ్జి
నూతనకల్ : వరద ఉధృతి కారణంగా నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామం వద్ద బ్రిడ్జి స్వల్పంగా కూలింది. వర్షాలకు దెబ్బతిన్న ఈ బ్రిడ్జిని తక్షణ చర్యల్లో భాగంగా గతేడాది రూ.3లక్షల నిధులతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టారు. అధికారులు కూడా పర్యవేక్షించకపోవడంతో బ్రిడ్జి మరమ్మతులు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. దీంతో ప్రస్తుత కురుస్తున్న వర్షాలకు వరద ఉధృతి అధికంగా రావడంతో గతంలో మరమ్మతులు చేసిన ప్రాంతంలో బ్రిడ్జి కూలింది. విషయం తెలుసుకున్న ఆర్‌అండ్‌బీ డీఈ పద్మావతి సంఘటన స్థలాన్ని సందర్శించారు. వాహనాలదారులు ప్రమాదం బారిన పడకుండా బ్రిడ్జి కూలిన ప్రదేశాన్ని గుర్తు పట్టేలా మార్కింగ్ ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనదారులు బ్రిడ్జిపై నుంచి నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
ఫ మూణ్నాళ్ల ముచ్చటగా
మరమ్మతులు
ఫ అధికారుల పర్యవేక్షణ
లోపమే కారణం

కూలిన గుండ్లసింగారం బ్రిడ్జి