మౌలిక వసతుల కల్పనకు కృషి
హుజూర్‌నగర్ : వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ వ్యయసాయ మార్కెట్‌ను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా మార్కెట్‌కు అవసరమైన 2,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాము, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం, మంచి నీటి సౌకర్యం, విద్యుదీకరణ, మఠంపల్లి సబ్ యార్డులో సీసీ రోడ్లు, పశువుల సంత ఏర్పాటు, తాగు నీటి వసతి, కోల్డ్‌స్టోరేజీ నిర్మాణాల విషయమై పరిశీలించారు. స్థానిక అధికారులను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ దేశముఖ్ రాధిక అరుణ్ కుమార్, మార్కెటింగ్ ఎస్‌ఈ లక్ష్మణ్ గౌడ్, వరంగల్ రీజియన్ జేడీ ఉప్పల శ్రీనివాస్, నల్లగొండ డీఈ రవీందర్, డీఎంఓ నాగేశ్వరశర్మ, ఉన్నత శ్రేణి కార్యదర్శి కె. శ్రీధర్, మార్కెట్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి


