పాలేరు వాగులో నీటిని వృథా చేస్తే సహించేదిలేదు
● ఇరిగేషన్ ఈఈ సత్యనారాయణ
అనంతగిరి: పాలేరు వాగులో నీటిని వృథా చేస్తే సహించేది లేదని ఇరిగేషన్ ఈ ఈ సత్యనారాయణ అన్నారు. సోమవారం అనంతగిరి మండల పరిధిలోని కొత్తగూడెం శివారులో పాలేరువాగు, చెక్‌డ్యాంతో పాటు ఫ్లడ్ గేట్లను పరిశీలించి మాట్లాడారు. పాలేరు వాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఫ్లడ్ గేట్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. వీరిపై నేలకొండపల్లి, అనంతగిరి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టినట్లు తెలిపారు. ఆయన వెంట ఇరిగేషన్ డీఈ రాంప్రసాద్, ఏఈ శ్రీనివాస్, భూక్యా రవినాయక్, బాబురావు, తేజావత్ వెంకటేశ్వర్లు, భూక్యా సురేష్ ఉన్నారు.


