యాదాద్రిలో వ్రత పూజలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

యాదాద్రిలో వ్రత పూజలు ప్రారంభం

Published Wed, Nov 15 2023 1:28 AM

యాదగిరీశుడి ఆలయంలో వ్రతాలను 
ఆచరిస్తున్న భక్తులు - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత పూజలు ప్రారంభమయ్యాయి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తొలిరోజు మంగళవారం వ్రత మండపంలో 6 బ్యాచ్‌లుగా 174 జంటలు పాల్గొని వ్రతాలు ఆచరించారు. ఆలయానికి రూ.1,39,200 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

తిరునక్షత్ర వేడుకలు కూడా..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మణవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలు మంగళవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఆగమశాస్త్రానుసారంగా ఆలయ ముఖ మండపంలో తొళక్కం నిర్వహించారు. వేద మంత్రాలతో పూజలు జరిపించారు. ఈ వేడుకల్లో ఆలయ ఆచార్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఫ తొలి రోజు వ్రతాలు ఆచరించిన

174 జంటలు

Advertisement
 
Advertisement