కేటీఆర్‌ రోడ్‌ షో హైలెట్స్‌ | - | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ రోడ్‌ షో హైలెట్స్‌

Published Wed, Nov 15 2023 1:28 AM | Last Updated on Wed, Nov 15 2023 1:28 AM

-

● మంత్రి కేటీఆర్‌ మధ్యాహ్నం 1.45గంటలకు చిట్యాలకు చేరుకున్నారు.

● రోడ్‌ షోలో 27 నిమిషాలు మాట్లాడారు.

● ఎన్నికల ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేసిన కేటీఆర్‌.. ఇళ్లపై నిలబడి నినాదాలు చేస్తున్న వారికి ‘జాగ్రత్త కింద పడుతారు’ అంటూ సైగలు చేశారు.

● పలువురు నాయకులు, కార్యకర్తలు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు.

● కేటీఆర్‌ ప్రసంగిస్తున్న సమయంలో చిరుమర్తి లింగయ్య నాయకత్వం వర్థిల్లాలి అంటూ యువకులు నినాదాలు చేస్తుండగా.. నేను కూడా చిరుమర్తి లింగయ్య కోసమే వచ్చానని మంత్రి అన్నారు.

● కేటీఆర్‌ చిట్యాలలో రోడ్‌ షోలో వాహనంపైకి ఎక్కగానే వాహనం పైభాగంలో రెలియింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు.

● యువకులు డీజే పాటలకు డాన్స్‌లు చేశారు. వారితో పాటు చిరుమర్తి లింగయ్య సైతం డాన్స్‌ చేశారు.

● రోడ్‌ షోలో పాల్గొన్న పలువురి పర్సులను దొంగలు చోరీ చేశారు.

– చిట్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement