పేలుమందు తాగి విద్యార్థి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పేలుమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

ఎల్‌.ఎన్‌.పేట : మండలం కేంద్రంలోని రోటరీనగర్‌కు చెందిన ప్రసాదం కార్తిక్‌ (13) అనే విద్యార్థి పేలు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎల్‌.ఎన్‌.పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు బి.జీవేశ్వరరావు తెలిపారు. కార్తిక్‌ పేలుమందు తాగడంతో బంధువులు ఆదివారం మధ్యాహ్నం పీహెచ్‌సీకి తీసుకొచ్చారని, చికిత్స అందించేలోపు మృతి చెందాడని పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. కార్తిక్‌ గతంలోనూ ఆత్మహత్య చేసుకునేందుకు రైలు కింద కాలు పెట్టాడని, అప్పట్లో కాలు తొలగించారని స్థానికులు తెలిపారు. మృతుడికి తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు ఉన్నారని చెప్పారు. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సరుబుజ్జిలి ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement