ఉత్కంఠగా ఆర్చరీ ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్కంఠగా ఆర్చరీ ఎంపిక పోటీలు

Nov 16 2026 12:32 AM | Updated on Nov 16 2026 12:32 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: విలువిద్య(ఆర్చరీ)తో లక్ష్యాలను ఎక్కుపెట్టవచ్చని జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ చల్లా జగదీష్‌ పేర్కొన్నారు. అరసవల్లిలోని ఆదిత్య ఆర్చరీ అకాడమీ వేదికగా జిల్లాస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14, 17, 19 బాలబాలికల ఆర్చరీ ఎంపిక పోటీలు ఆదివారం నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపికచేశారు. కార్యక్రమంలో ఆర్చరీ సంఘ జిల్లా కార్యదర్శి ఎల్‌.చిట్టిబాబు, ఆదిత్య ఆర్చరీ అకాడమీ ఫౌండర్‌ సీహెచ్‌ రాజ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ జి.వెంకటేశ్వరరావు, హెచ్‌ఎం యాళ్ల పోలినాయుడు, సతీష్‌, రవికుమార్‌, సెలక్షన్‌ కమిటీ ప్రతినిధులు, పీడీలు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement