సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే పలాసలో కూటమి పాలనలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. సాధారణ ఎన్నికల తదనంతర పరిణామాల నుంచి మొదలైన దాడులు నిత్యకృత్యంగా మారి స్థానిక ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. దాడులు, భూ ఆక్రమణలు, గ్రావె ల్– మట్టి మాఫియా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల ఘటనలు పలాస– కాశీబుగ్గ ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యల్లో రక్షణ విభాగం బిజీగా ఉంది. ఇక్కడి ప్రముఖ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి కనీస బందోబస్తు పెట్టలేని స్థితిలో తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన చోటు చేసుకున్న విషయం విదితమే.
అధికారమిస్తే...దోచుకున్నారు
ప్రజలకు మేలు చేయమని అధికారమిస్తే దోచుకోవడానికి లైసెన్సుగా మార్చుకున్నారని స్థానికులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ భూములు కబ్జా చేశారు. కొండలను సైతం కరిగించేశారు. పలాస–కాశీబుగ్గలో సూదికొండ, నెమలికొండను అక్రమంగా తవ్వేసి బోడిగుండు చేశారు. గ్రావెల్, కంకర తవ్వి తరలించారు. ఎంఐజీ లేవుట్‌కు రవాణా చేసి, ఆ బిల్లులు పెట్టుకుని రూ.కో ట్లు సంపాదించుకున్నారు. సూదికొండ, నెమలికొండ చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా ఎర్రచెరువు కాలువ, జగన్నాథసాగరం, అంబుసోలు చెరువు, కుంకుమ సాగరం తదితర చెరువులను ఆక్రమించారు. సూదికొండ చుట్టూ కబ్జాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కలకలం రేపుతున్న దాడులు
శాంతిభద్రతల వైఫల్యానికి పరాకాష్టగా నియో జకవర్గంలో జరుగుతున్న దాడులు, అత్యాచార యత్నాల ఘటనలు కలకలం రేపుతున్నాయి. బాధితులకు న్యాయం జరగకపోగా అధికార పక్షానికి చెందిన కొందరు కీలక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నా యి. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్తున్న బాధితులపైన పోలీసుల ఎదుటే దాడులు చేయడమే కాదు ఎదరు కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. రాజకీయ పంతాలు, పట్టింపుల మధ్య పలాస జీవనాడి అయిన జీడిపప్పు పరిశ్రమ, స్థానిక వ్యాపారాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
పలాసలో జరిగిన సంఘటనల్లో కొన్ని..
● పలాస మండలం నీలావతికి చెందిన పౌర హ క్కుల సంఘం నేత డిల్లీరావు అనుమానాస్పదంగా మృతి చెందారు. బాధ్యుల్ని అరెస్టు చేయాలని నిరసన తెలిపితే... అందులో పాల్గొన్న సీదిరి అప్పలరాజుతో పాటు 16మందిపై విధులకు ఆటంకం కలిగించారంటూ కేసులు నమోదు చేశారే తప్ప అనుమానస్పద మృతికి కారకులైన వారిని పట్టుకోలేదు.
● 2024 అక్టోబరు 27న ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అనుచరులు అల్లు రమణ, మన్మధలపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లోనే టీడీపీ నాయకులు దాడి చేశా రు. పిడిగుద్దులు గుద్ది, షర్టులు చింపేసి రౌడీల్లా వీరంగం సృష్టించారు.
● ప్రస్తుతం చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీపద్మ ఇంటిపైకి వెళ్లి టీడీపీ నాయకులు దాడులు చేశారు.
● కళింగ వైశ్య సామాజిక వర్గానికి తూముల శ్రీనివాసరావు ఇంటిపైన దాడి చేశారు.
● ఉత్సవాల్లో డ్యాన్స్ చేయను అన్నందున తొమ్మి దో తరగతి చదువుతున్న బాలికపై పలాస మండలం తెలుగు యువత అధ్యక్షులు కిక్కర ఢిల్లీరావు దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిపైనా దాడికి పాల్పడటం అదీ అర్ధరాత్రి సమయంలో గమనార్హం.
● కాశీబుగ్గ కేంద్రంగా ఇద్దరు బాలికలపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడమే కాకుండా మరో యువకుడు వీడియోలు తీయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.


