రైల్వే అండర్‌ పాసేజ్‌లో పడి యువతి మృతి | - | Sakshi
Sakshi News home page

రైల్వే అండర్‌ పాసేజ్‌లో పడి యువతి మృతి

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

నందిగాం: కవిటిఅగ్రహారం వద్ద ఉన్న రైల్వే అండర్‌ ప్యాసేజ్‌లో గ్రామానికి చెందిన కోనారి కల్యాణి అలియాస్‌ జ్యోతి (26) గురువారం రాత్రి పడిపోయి మృతి చెందారు. కుటుంబసభ్యులు, జీఆర్పీ ఎస్‌ఐ దుంపల శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం కవిటిఅగ్రహారానికి చెందిన రోణగల సన్యాసమ్మ, లచ్చయ్య కుమార్తె కల్యాణిని ఆరేళ్ల కిందట జలుమూరు మండలం సంతలబైరికి చెందిన కోనారి కృష్ణారావుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి ఐదేళ్ల కుమారుడు ఉన్నా డు. కల్యాణి దసరాకి కన్నవారి ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో బహిర్భూమి కోసం వెళ్లి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం వర్షపు నీటితో నిండి ఉన్న రైల్వే అండర్‌ పాసేజ్‌లో ఆమె శవమై తేలుతూ కనిపించింది. రైల్వే పో లీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పలాస ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement