● ఊరు వదిలినా.. కష్టాలు వదలలేదు | - | Sakshi
Sakshi News home page

● ఊరు వదిలినా.. కష్టాలు వదలలేదు

Oct 31 2026 8:25 AM | Updated on Oct 31 2026 8:25 AM

ఎడతెరిపి లేని వానకు వరద తోడు కావడంతో మూలపేట పోర్టు పునరావాస కాలనీ జలమయమైంది. నౌపడలో నిర్మించిన మూలపేట, విష్ణుచక్రం పునరావాస కాలనీల్లోకి వరద నీరు చేరడంతో రహదారులన్నీ చెరువులను తలపించాయి. రెండు రోజుల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో వంటలు చేసుకునేందుకు కూడా వీలు లేక అవస్థలు పడ్డారు. కనీసం కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా సరైన సదుపాయం లేని దుస్థితి నెలకొంది. మరోవైపు ఇళ్లనిర్మాణాల కోసం తెచ్చి పెట్టుకున్న ఇసుక, సిమెంట్‌ బస్తాలు వరద నీటికి తడిచిపోయాయి. సొంత గ్రామాల్లో ఎంతో దర్జాగా బతికిన తాము పోర్టు నిర్మాణం కోసం అన్నీ త్యాగం చేసి ఇక్కడకు వచ్చామని, ఇక్కడ కనీస సౌకర్యాలు లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామ ని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతబొమ్మాళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement