నేను కార్పెంటర్‌గా జీవనం సాగిస్తున్నాను. సుమారు రూ.10 లక్షలు విలువైన డిజైనింగ్ మిషన్ ఇటీవల తెచ్చి కర్ర పనిముట్లు తయారు చేస్తున్నాను. తుఫాన్ వరదలు రావడంతో మా షెడ్ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. రూ.పది లక్షలు విలువైన డిజైన్ మిషన్ పూర్తిగా పాడై పోగా, రూ.10లక్షలు విలువైన కలప పోయింది. కుటుంబంతో పస్తులున్నాం. – కోటిపల్లి సంతోష్, కార్పెంటర్, లొద్దపుట్టి
తిండి లేదు.. కంటికి కునుకు లేదు
మూడు రోజులుగా కడుపుకు తిండి లే దు.. కంటికి కునుకు లేకుండా పోయింది. ఇళ్లలోకి నీరు రావడంతో తిండి గింజలు సైతం తడిసి ముద్దైపోయాయి. మమ్మల్ని ఆదుకోవడానికి ఏ ఒక్క అధికారి కూడా రాలేదు. – బాధితులు, అంబుగాం వీధి, లొద్దపుట్టి


