ధూపదీప నైవేద్యం భూములు స్వాహా | - | Sakshi
Sakshi News home page

ధూపదీప నైవేద్యం భూములు స్వాహా

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

మల్లికార్జునా నీవే దిక్కు..

● తాజాగా మల్లికార్జున స్వామి ఆలయ భూములపై వివాదం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

కూటమి పాలనలో దేవు డి భూములకూ రక్షణ లేకుండా పోయింది. ఆలయ భూములు రానురాను లేఅవుట్లుగా మారిపోతున్నాయి. తాజాగా పొందూరులో దేవుడి భూములపై కన్నేశారు. మల్లికార్జున స్వామి ఆలయ భూములను కాజేసేందుకు పచ్చనేతలు పథకం ప్రకారం వెళ్తున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు చూపించి, విలువైన ఆలయ భూములను కొట్టేసేందుకు ప్లాన్‌ చేశారు. అధికారులు ఆ భూములు కాపాడడం మీద కంటే ఆక్రమణదారులకు వదిలిపెట్టడంపైనే దృష్టి సారిస్తున్న వింత వైఖరి కనిపిస్తోంది.

దర్జాగా కబ్జా...

పొందూరులో భూములకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. వాటి ధర కూడా అంతే ఎక్కువగా ఉంది. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసేస్తున్నారు. ఇప్పటికే మండల కేంద్రం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. వాటితో పాటే దేవదాయ భూములను కూడా ఆక్రమణదారుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. శాలిహుండం వేణుగోపాలస్వామి ఆలయ భూముల వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ ఆలయ భూములు ఇష్టారీతిన అమ్మేయడం, కొనుగోలు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ల వరకు వెళ్లాయి. వాటిపై వివాదం నడుస్తూనే ఉంది. వేణుగోపాలస్వామి భూములు అమ్మడానికి, కొనడానికి లేదని దేవదాయ శాఖ అధికారులు తమదైన శైలిలో చెబుతున్నారే తప్ప వాటిని కాపాడేందుకు స్పష్టమైన వైఖరితో వెళ్లడం లేదు. వేణుగోపాలస్వామి ఆలయ భూములే కాదు లక్ష్మీపేట లైన్‌లోని రామలింగేశ్వరస్వామి ఆలయం భూములు, సోమలింగేశ్వరస్వామి ఆలయం భూములు, వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు కూడా పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. పదుల సంఖ్యలో ఆక్రమణలు ఉన్నాయి.

ఆలయాలకు చెందిన ఎకరాలకు ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కోట్లాది రూపాయల విలువైన భూములు చేతులు మారిపోయాయి. ధూపదీప నైవేద్యాల కోసం ఇచ్చిన భూములను కబ్జాదారులు తమ గుప్పెట్లో పెట్టుకుని, ఇష్టారీతిన లావాదేవీలు జరుపుతున్నారు. పక్కనున్న జిరాయితీ భూముల సర్వే నంబర్లు చూపించి, ఆలయ భూముల రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. రిజిస్టార్‌ అధికారులు సైతం అవేవీ పట్టించుకోకుండా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఆలయ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్లు ఏర్పాటవుతున్నాయి. ఇందులో తిలాపాపం–తలా పిడికెడు అన్నట్టు కాపాడాల్సిన అధికార వర్గాలు సైతం చేతివాటం ప్రదర్శించి, ఆక్రమణలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో దేవదాయ భూములు పరుల పాలవుతున్నాయి.

దేవాలయాల భూములు కొట్టేస్తున్న తెలుగు తమ్ముళ్లు

పథకం ప్రకారం కబ్జా, ఆపై లావాదేవీలు

తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు

తాజాగా దేవాంగుల వీధిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయ భూములను సైతం అదే రకంగా ఆక్రమించి, తప్పుడు డాక్యుమెంట్లతో కొట్టేస్తున్నా రు. ఇప్పటికే దీనిపై ఫిర్యాదులు కూడా వెళ్లా యి. రోడ్డుకు ఆనుకుని సర్వే నంబర్‌–163లో ఎకరా 30 సెంట్లు వరకు దాంట్లో చాలా వరకు ఆక్రమించడమే కాకుండా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. తప్పుడు డా క్యుమెంట్లతో లావాదేవీలు కూడా జరిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ఈ భూ ముల బాగోతం నడుస్తోంది. ఆ ప్రభుత్వం అధి కారం లేకపోతే ఎక్కడికక్కడ వ్యవహారాలు నిలిచిపోయాయి. 2017లో ప్రారంభమైన అక్రమాల పర్వం మళ్లీ తాజాగా ఊపందుకుంది. సెంటు రూ.7లక్షలు చొప్పున విక్రయాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఓ కీలక నేత అసిస్టెంట్‌ కనుసన్నల్లో ఇదంతా జరుగుతోంది. అధికారులను సైతం శాసిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతోకొంత ఆలయానికి వదిలేసి, మిగతాది కబ్జాదారులకు వదిలేసేలా ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే ఆలయ భూములు పూ ర్తిగా కబ్జాకు గురయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement