‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’ | - | Sakshi
Sakshi News home page

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’

Oct 2 2026 5:26 AM | Updated on Oct 2 2026 5:26 AM

‘స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి’ సీతయ్య ఫౌండేషన్‌కు చేరిన వృద్ధుడు

నరసన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోందని, దీనికి సన్నద్ధం కావాలని, అవసరమైన ఎన్‌ఓసీ పత్రాలు ముందుగానే రెడీ చేసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పిలుపునిచ్చారు. మున్సిపల్‌, కార్పొరేషన్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ పదవులకు పోటీ చేసే ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి పన్ను రసీదు, ఇతరత్రా ఎన్‌ఓసీ పత్రాలు వెంటనే తీసుకొని భద్రపరచుకోవాలని కృష్ణదాస్‌ సూచించారు.

కవిటి: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఎస్‌వీజే విద్యాసంస్థల ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన గడిచిన 4 రోజులుగా దుర్భర పరిస్థితుల్లో పడి ఉన్న వృద్ధుడి పరిస్థితిని గుర్తించిన ఆ సంస్థ విద్యార్థులు చేయూతను అందించారు. గురువారం అతడి పరిస్థితిని గమనించి కంచిలి మండలం తలతంపర సమీపంలో నిర్వహిస్తున్న సీతయ్య ఫౌండేషన్‌ వారికి సమాచారం అందించి వారి సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేశారు. సీతయ్య ఫౌండేషన్‌ వాహనంలో ఎస్‌వీజే సంస్థ ఉపాధ్యాయులు, బాలబాలికలు అందరూ ఆ వృద్ధుడిని పంపించారు.

ఉద్దానం తాగునీరు పైప్‌లైన్‌ లీక్‌

పాతపట్నం: పాతపట్నం ఆల్‌ఆంధ్రరోడ్డు సమీపంలో మహేంద్ర డిగ్రీ కళాశాల ముందు రోడ్డు పక్కన ఉద్దానం ప్రాజెక్టు ద్వారా హిరమండలం నుంచి మెళియాపుట్టి వెళుతు న్న తాగునీరు పైప్‌లైన్‌ లీక్‌ కావడంతో తాగునీరు వృథాగా పోతోంది. గురువారం మధ్యా హ్నం పైప్‌లైన్‌ లీకై ంది. అధికారులు స్పందించడం లేదని, గతంలో కూడా పైప్‌లైన్‌ లీకై నీరు వృథా అయిందని స్థానికులు చెబుతున్నారు.

వర్సిటీలో ఇద్దరు బోధకుల సస్పెన్షన్‌

ఎచ్చెర్ల: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వ విద్యాలయం న్యాయ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు బోధకులను సస్పెండ్‌ చేశారు. నేటి నుంచి వీరి సస్పెండ్‌ అమలు చేయనున్నారు. నెలరోజులు పాటు వీరిని సస్పెండ్‌ చేశారు. బుధవారం న్యాయ కళాశాలను వీసీ కేఆర్‌ రజనీ ఆకస్మికంగా తనీఖీ చేసినప్పుడు క్లాస్‌రూంలో విద్యార్థులు తప్ప బోధకులు లేకపోవడంతో పాటు సమయ పాలన పాటించకపోవడంతో వీరిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. దీంతో సంబంధిత శాఖ వారు నాన్‌టీచింగ్‌ బోధకుడు, సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఫ్యాకల్టీలను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

జాతీయ స్థాయిలో సిక్కోలు అమ్మాయి ప్రతిభ

నందిగాం: మండలంలోని కాపుతెంబూరుకు చెందిన మౌనిక మిశ్రో జాతీయ స్థాయి లాంగ్‌ జంప్‌ పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి సత్తా చాటింది. బుధవారం తిరుపతిలో జరిగిన జాతీయ స్థాయి లాంగ్‌ జంప్‌ పోటీల్లో సత్తా చాటిన మౌనిక టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతుంది. మౌనిక తండ్రి శ్రీనివాసరావు మిశ్రో విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కాగా తల్లి చిన్ని మిశ్రో గృహణి. కుమార్తె సాధించిన ప్రతిభపై శ్రీనివాస మిశ్రో హర్షం వ్యక్తం చేశారు.

ఆల్‌ఆంధ్రా రోడ్డు సమీపంలో ఉద్దానం పైప్‌ నుంచి లీక్‌ అవుతున్న తాగునీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement