సర్కారు డప్పు
ఎలా మేలు చేస్తుంది..?
గత ప్రభుత్వ హయాంలో కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేశాం. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రతి పథకాన్ని వారి ఇంటికి చేరవేశాం. అప్పట్లో ప్రతిపక్ష నాయకులు మాపై గగ్గోలు పెట్టారు. రూ.5వేలు జీతం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇప్పుడు కేవలం ప్రచారం కోసం ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రజల డబ్బు పంచేందుకు సిద్ధమయ్యారు. ఇది జనాలకు ఎలా మేలు చేస్తుందో ప్రభుత్వమే చెప్పాలి.
– సునీల్, మాజీ వలంటీర్,
సోంపేట మేజర్ పంచాయతీ
ప్రజాధనం వృథా కాదా.?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.పది వేలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్ల వల్ల ప్రజాధనం వృధా అవుతోందని ఆ వ్యవస్థనే చంపేశారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 15వేలు చొప్పున కట్టబెట్టడం ప్రజాధనం వృథా కాదా..? మహంతి రామసత్యం, గొర్లెపేట గ్రామం, రణస్థలం మండలం


