బీసీల వెన్నుపోటుదారు డు చంద్రబాబు అని మ రో సారి నిరూపించారు. సాధ్యం కాని రిజర్వేషన్ జీఓలతో కోర్టులను ఆశ్రయించి మరో సారి బీసీలను రాజకీయంగా దొంగ దెబ్బ తీశారు. 34 శాతం రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినప్పటికీ మభ్యపెట్టేందుకు కోర్టులను ఆశ్రయించారు. వృత్తి పనిముట్లు తీసుకోవడానికే బీసీలు అనే భావన చంద్రబాబుకు ఉంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలను అణచివేయడమే ఆయన నైజం. – పేరాడ తిలక్ ,
వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త
తిరుగుబాటు చేయాలి
బీసీలను మోసగిస్తున్న చంద్రబాబు పై తిరుగుబాటు చేయాలి. ఎన్నికల మనుపు సాధ్యం కాని హామీలతో బీసీలతో పాటు మిగిలిన వర్గాలను మోసం చేశారు. ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్ పేరుతో మరో సారి బీసీలను భంగపాటుకు గురి చేశారు. చంద్రబాబు పై బీసీలు తిరుగుబాటు చేయాలి. – జి.గురునాథ్ యాదవ్,
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టెక్కలి


