శ్రీకాకుళం క్రైమ్ : నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాల సేకరణను బలోపేతం చేయడంతో పాటు నేరస్థలానికి ఫోరెన్సిక్ సేవలను వేగంగా అందుబాటులోకి తెచ్చే మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం వాహనంలో ఆధునిక శాసీ్త్రయ పరికరాలను పరిశీలించి వాటి వినియోగ విధానం, నేరస్థలంలో ఆధారాల సేకరణ, డాక్యుమెంటేషన్, భద్రపరిచే ప్రక్రియల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
33 రకాల ప్రత్యేక పరికరాలతో..
నేర స్థలికి చేరుకుని అక్కడ లభించే భౌతిక, జీవ, ఫింగర్‌ప్రింట్, ట్రేస్, గన్‌షాట్ రెసిడ్యూ, మాదక ద్రవ్యాలు, అగ్ని ప్రమాదాలకు సంబంధించి ఆధారాలతో పాటు డిజిటల్ ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో గుర్తించి సేకరించి వాటిని భద్రపరిచేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుంది. సైబర్ ఫోరెన్సిక్ టూల్స్, ఫోరెన్సిక్ లై ట్స్, బ్లడ్, డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లో, జివ్ స్క్రీనింగ్ కిట్, ఫొటోగ్రఫీ, డాక్యుమెంటేషన్ తదితర 33 రకాల ప్రత్యేక పరికరాలు అందుబాటులో ఉంటాయన్నారు.
ఎస్పీ మాట్లాడుతూ..
నేర దర్యాప్తులో శాసీ్త్రయ ఆధారాలు అత్యంత కీలకమని, ఈ వాహనం ద్వారా ఆధారాలు పాడవ్వడం లేదా నష్టపోయే అవకాశాలు తక్కువన్నారు. ఆధారాలను సేకరించి సరైన చైన్ ఆఫ్ కస్టడీతో భద్రపర్చడం ద్వారా కేసుల దర్యాప్తు నాణ్యత మరింత మెరుగుపడుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన నేరాలు ఛేదించి న్యాయస్థానాల్లో శాసీ్త్రయ ఆధారాల ప్రాముఖ్యత పెంచేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఫింగర్ ప్రింట్ విభాగం ఇన్‌స్పెక్టర్ పి.భరత్‌కుమార్, క్లూస్‌టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.
మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహనమిదే..
ప్రత్యేక పరికరాలివే..


