కంటి తుడుపు చర్యలు వద్దు.. కరుణ చూపండి | - | Sakshi
Sakshi News home page

కంటి తుడుపు చర్యలు వద్దు.. కరుణ చూపండి

Sep 26 2026 1:32 AM | Updated on Sep 26 2026 1:32 AM

కంటి తుడుపు చర్యలు వద్దు.. కరుణ చూపండి ● రైలు ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి ● బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ

తమ్మినేని పరామర్శ

● రైలు ప్రమాద బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి ● బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ

టెక్కలి: ఇటీవల జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మానుకోవాలని, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ డిమాండ్‌ చేశారు. పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌తో కలిసి శుక్ర వారం టెక్కలి మండలం డమర, చిన్నభీంపురం గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. తిలక్‌ ఆధ్వర్యంలో మృతి చెందిన వి ద్యార్థుల కుటుంబాలతో పాటు గాయపడిన యువకుడి కుటుంబానికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పన ఆర్థిక సాయం అందజేశారు.

ఈ సందర్భంగా కృష్ణదాస్‌ మాట్లాడుతూ రైలు ఢీకొని విద్యార్థులు మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. ఆస్పత్రి నుంచి మృతదేహాలను తరలించే విషయంలో ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరమని తెలిపారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తిలక్‌ మా ట్లాడుతూ.. గిరిజన వసతి గృహాల్లో భద్రత లేదనే విషయానికి ఈ సంఘటన నిదర్శనమన్నారు. బా ధిత కుటుంబాలకు రూ.25 లక్షలు, ఇళ్లతో పాటు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు సాల్మన్‌రాజుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. వీరితో పాటు మాజీ జెడ్పీటీసీ దువ్వాడ వాణి, మాజీ ఎంపీపీలు ఆట్ల సరోజన మ్మ, నడుపూరు శ్రీరామ్మూర్తి, పార్టీ కళింగ సామాజిక వర్గం అధ్యక్షుడు ఆరంగి మురళి, మాజీ సర్పంచ్‌ బి.రాకేష్‌, నాయకులు సత్తారు సత్యం, కె.బాలకృష్ణ, వై.చక్రవర్తి, కె.అజయ్‌, కె.రవికుమార్‌ గాంధీ, ఎం.గణపతిరావు, డి.కామన్న, ఎస్‌.ఉమాపతి, జె.చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రమాద బాధితుడితో మాట్లాడుతున్న తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): రైలు ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాల్మన్‌రాజుని మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుని తల్లిదండ్రులతో మాట్లాడుతూ మీ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆయన వెంట తమ్మినేని చిరంజీవినాగ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement