ఎచ్చెర్ల : ప్రపంచంలో నెలకొన్న అసమానతలు, సంఘర్షణల నివారణకు వేదాంత విధానమే మార్గం చూపిస్తుందని అలహాబాధ్ యూనివర్సిటీ ఫిలాసఫీ ప్రొఫెసర్ సూర్యకాంత్ మహారాణా చెప్పారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీలో శాంతి, విభిన్న సంస్కృతులపై జరిగిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమనిషి శాంతిగా జీవించినప్పుడే దేశం శాంతియుతంగా ఉంటుందని, దేశాల్లో శాంతి నెలకొన్నప్పుడే ప్రపంచశాంతి సాధ్యమౌతుందని తెలిపారు. పాటలీపుత్ర యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ఆభాసింగ్ మాట్లాడుతూ ప్రపంచ శాంతికి యోగా ఎలా సహకరిస్తుందో వివరించారు. కార్యక్రమంలో అంబేడ్కర్ వర్సిటీ వీసీ కె.ఆర్ రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డ య్య, నాగార్జున యూనివర్శిటీ మాజీ వీసీ వి. బాలమోహన్‌దాస్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అనురాధ, సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్, కమిటీ కన్వీనర్లు సాంబశివరావు, ఎన్.సంతోష్‌రంగనాథ్, కృష్ణయ్య, వెంకటరావు, అబ్రహం, సునీల్, లక్ష్మీనా రాయణ తదితరులు పాల్గొన్నారు.


