టెక్కలి: సంతబొమ్మాళి మండలానికి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. హనుమంతునాయుడుపేట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు కోళ్ల కృష్ణమూర్తి, ఈశ్వరరావు, కోళ్ల శంకరరావు, బైరాగి, రామారావు, శంకరరావు, సోమేశ్వరరావు, తియ్యాల శంకరరావు, పాలకొండ శంకరరావు, పి.పోలయ్య, కె.సూర్యనారాయణ, బుజ్జిబాబు, సీరపు రమేష్ తదితర 20 కుటుంబాలు శుక్రవారం టెక్కలిలో పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాల వసంత్‌రెడ్డి, హనుమంతునాయుడుపేట పంచాయతీకి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు పాల మహేష్ సమక్షంలో పార్టీ కండువా ధరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.


