29న జెన్‌–జెడ్‌ సెమినార్‌ | - | Sakshi
Sakshi News home page

29న జెన్‌–జెడ్‌ సెమినార్‌

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఈ నెల 29న ‘నేటి యువత ఆసక్తులు, ఆలోచనలు, ఆదర్శాలు ఏమిటి?’ అనే అంశంపై జెన్‌–జెడ్‌ సెమినార్‌ నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం శ్రీకాకుళంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో సెమినార్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేటి యువత సమాజంపై బాధ్యతతో వ్యవహరించడం, ఇతరుల పట్ల గౌరవం కలిగి ఉండటం, భారతదేశ పౌరులుగా తమ బాధ్యతలను గుర్తించడం, సామాజిక సమస్యలపై అవగాహన పెంపొందించుకోవడం వంటి అంశాలపై ఈ సెమినార్‌లో చర్చించనున్నట్లు తెలిపారు. దేశంలో విద్యారంగంలో పెరుగుతున్న ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ, విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేస్తున్న పేపర్‌ లీకేజీలు వంటి సమస్యలపై యువతలో చర్చ, అవగాహన అవసరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి. చందు, గర్‌ల్స్‌ కన్వీనర్‌ దివ్య, జిల్లా కమిటీ సభ్యులు మురళి, జగన్‌, కార్తీక్‌, పార్థు, దివాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement