జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శనివారం ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన నిమిత్తం జనాలను తరలించేందుకు బస్సులు కేటాయించడంతో కాంప్లెక్స్‌లో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న అరకొర బస్సులు కూడా క్షణాల వ్యవధిలో నిండిపోవడంతో మిగిలిన వారంతా ఉసూరుమంటూ నిట్టూర్చారు. ప్రయాణికులకు సరిపడా బస్సులు కేటాయించకపోవడంతో పాలకుల తీరుపై మండిపడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం/శ్రీకాకుళం అర్బన్


