● 21 నుంచి వానలు ప్రారంభమయ్యే అవకాశం ● 22, 23 తేదీల్లో భారీ వర్షాలు ● అధికారులకు సెలవులు రద్దు | - | Sakshi
Sakshi News home page

● 21 నుంచి వానలు ప్రారంభమయ్యే అవకాశం ● 22, 23 తేదీల్లో భారీ వర్షాలు ● అధికారులకు సెలవులు రద్దు

Sep 20 2026 12:21 AM | Updated on Sep 20 2026 12:21 AM

● 21 నుంచి వానలు ప్రారంభమయ్యే అవకాశం ● 22, 23 తేదీల్లో భారీ వర్షాలు ● అధికారులకు సెలవులు రద్దు

శ్రీకాకుళం పాత బస్టాండ్‌:

తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాబో యే నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఈనెల 23, 24 తేదీల్లో తుఫానుగా శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర వైపునకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ నెల 21 నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమై, 22, 23 తేదీల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకా శం ఉన్నందున మత్స్యకారులు ఈ నెల 25 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో 24 గంటలూ పనిచేసే విపత్తు నిర్వహణ కంట్రోల్‌ రూమ్‌ (ఫోన్‌: 08942 240557) అందుబాటులోకి తెచ్చామని, 11 కోస్తా మండలాలకు సీనియర్‌ అధికారులను ఇన్‌చార్జిలు గా నియమించామని పేర్కొన్నారు.

జిల్లాలోని అధికారులందరికీ సెలవులు రద్దు చేశామని, సోమవారం రాత్రి నుంచి రాత్రివేళ విధులు (నైట్‌ డ్యూటీలు) అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రవాహం ఉన్న కాలువలు, నదుల్లో కాకుండా ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని కలెక్టర్‌ సూచించారు. జలాశయాలు, నదుల నీటిమట్టం పెరుగుతున్నందున నదీ పరివాహక ప్రాంత ప్రజ లు సురక్షితంగా ఉండాలని, రాబోయే నాలుగు రోజుల పాటు ఇసుక రీచ్‌లలో తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తుఫాను పునరా వాస కేంద్రాలు లేని ప్రాంతాల్లోని పాఠశాలలను కేంద్రాలుగా మార్చి మంచినీరు, బియ్యం, ప్రాథమి క వసతులు కల్పిస్తున్నామని తెలిపారు.మట్టి ఇళ్లలో ఉండేవారు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు లేదా బంధువుల ఇళ్లకు వెళ్లిపోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో కలెక్టర్‌ తో పాటు ఎస్పీ కేవీ మహేశ్వర్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండియా, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రవణ్‌ కుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement