టెక్కలి రూరల్ : టెక్కలిలోని పాత జిల్లా ఆస్పత్రిలో ఐరన్ ఫ్రేమ్‌లు చోరీకి గురవుతున్నాయి. కొన్నాళ్లుగా నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలను ఎవరూ పట్టించుకోకపోవడంతో కొందరు విలువైన వస్తువులు పట్టుకుపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం వేళల్లో మందుబాబులు చేరుకుని అసాంఘికకార్యకలాపాలు సాగిస్తున్నారని అంటున్నారు. ఐరన్ గేటులు, కిటీకీలకు ఏర్పాటు చేసిన ఫ్రేమ్‌లను గోడలను బద్దలుకొట్టి పట్టుకుపోతున్నారని చెబుతున్నారు. ట్రామాకేర్ అంబులెన్స్ సైతం నిరుపయోగంగా వదిలేయడంతో అందులో వస్తువులు చోరీకి గురౌతున్నాయని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


