రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ పనుల రద్దీ కారణంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఎచ్చెర్ల నుంచి విజయనగరం వెళుతున్న కారును ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ సమయంలో కారులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. మరో కారును కూడా ఇంకో లారీ ఢీకొట్టింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదాలపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్సై చెప్పారు.


