శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్ వెనుక ఉన్న ఓ ఫైనాన్స్ సంస్థలో ఓ మహిళ గిల్ట్ నగలు తాకట్టు పెట్టి రూ. 2.40 లక్షలకు టోకరా వేసింది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. మహాలక్ష్మి నగర్ కాలనీకి చెందిన మండల భవాని ఈ ఏడాది జూన్ 15 న తమ ఫైనాన్స్ సంస్థను ఆశ్రయించిందని బ్రాంచ్ మే నేజర్ చౌదరి రవీంద్రబాబు పోలీసులతో పేర్కొన్నారు. పరిచయం ఉన్న మహిళ కావడంతో సిబ్బంది పూర్తి స్థాయిలో నగలు తనిఖీ చేయకుండా ౖపైపెనే చేసి ఒరిజినల్ బంగారు నగలే అనుకుని రూ. 2,43,300 రుణం మంజూరు చేశారని మేనేజర్ తెలిపారు. అక్కడకు కొద్ది రోజుల్లోనే జూలై 23న ఆడిట్ అధికారులు బ్యాంకుకు వచ్చి పూర్తిస్థాయిలో తనిఖీలు చే యగా పైన పూత బంగారం లోపల నకిలీ ఉండడాన్ని నిర్ధారించారన్నారు. వెంటనే మండల భవానీని ఫోన్‌లో సంప్రదించి బ్రాంచికి రప్పించి విషయం తెలుపగా తొందరలోనే తాకట్టు డబ్బులు కట్టేస్తానని చెప్పిందన్నారు. అయితే తాను తాకట్టు పెట్టిన బంగారు నగలు వేరే వారివని వారికే ఆ డబ్బులు పంపించానని మరోసారి చెప్పిన భవానీ.. ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. దీంతో పోలీసులను ఆశ్రయించినట్లు బ్రాంచ్ మేనేజర్ చౌదరి రవీంద్రబాబు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
‘పనుల్లో జాప్యం సహించబోను’
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనుల నిర్వహణను వేగవంతం చేయడంతో పాటు ఆన్‌లైన్ అప్‌లోడింగ్, బిల్లుల చెల్లింపుల ప్రక్రియను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీరాజ్, రహదారులు భవనాలు, నీటిపారుదల, ట్రైబ ల్ ఇంజినీరింగ్ సహా వివిధ శాఖల పరిధిలోని ఉపాధి హామీ పనుల పురోగతిపై అసిస్టెంట్ ఇంజినీర్ల వారీగా కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో మంజూరైన పనులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, పనులు పూర్తయిన వెంటనే బిల్లుల కు సంబంధించిన సమాచారాన్ని ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయా లని స్పష్టం చేశారు. కొత్తూరు, హిరమండలం, మందస, పలాస, సోంపేట, కంచిలి, కవిటి, ఇచ్చాపురం, గార, శ్రీకాకుళం, రణస్థలం, లావే రు, బూర్జ సహా జిల్లాలోని అన్ని మండలాల సహాయ ఇంజనీర్లు తమ తమ పరిధిలోని పనులను యుద్ధప్రాతిపదికన పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు.
రూ.లక్ష పలికిన లడ్డూ
వజ్రపుకొత్తూరు: మండలంలోని ఉద్దానం రామకృష్ణాపురం(బొడ్డువానితోటలు)లో వినియక చవితి లడ్డూ ఏకంగా రూ.లక్ష పలికింది. శుక్రవారం వినాయకుని నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డూ వేలం నిర్వహించగా సైనూరు గ్రామానికి చెందిన చింత బాలకృష్ణ ఒక్కసారిగా రూ.లక్షకు లడ్డూను దక్కించుకున్నారు.


