● కాలికి తీవ్ర గాయాలతో
విలవిల్లాడిన వాహనదారుడు
● అర్ధరాత్రి వేళ దారుణం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట సమీపంలోని నాగావళి వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తికి బుధవారం అర్ధరాత్రి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివీఽధికి చెందిన గుంటుకు స్వామిబాబు హయాతి నగరం నుంచి ఏడురోడ్ల కూడలి వైపు వెళ్తుండగా అటునుంచి అతివేగంగా వస్తున్న గుర్తు తెలియని ద్విచక్రవాహనదారుడు బలంగా ఢీకొట్టి పరారయ్యాడు. స్వామిబాబు కుడికాలు ముడుకు భాగం నుజ్జయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.


