పాతపట్నం: పాతపట్నం ఆల్‌ఆంధ్ర రోడ్డు సమీపంలో ఉన్న అక్షర పాఠశాల మైదానంలో సాఫ్ట్ టెన్నిస్ ఏపీ సబ్ జూనియర్ బాలికల ఇంటర్ డిస్ట్రిక్ట్ కమ్ రాష్ట్ర జట్టు ఎంపికలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. అనంతరం రాష్ట్రస్థాయి జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు వై.శేఖర్‌బాబు, ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ చైర్మన్ డి.నవీన్‌కుమార్‌లు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఆంధ్రప్రదేశ్‌కు పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అక్షర స్కూల్ డైరెక్టర్ రియాజ్ బేగ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ కొండాల చక్రపతి, కె.రాజారావు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.


