శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లోనూ కలిసి 12,159 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొండబోలు మాట్లాడుతూ లోక్ ఆదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ఎంతో మేలన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకుంటే ఇరు పక్షాలకు సమయం ఆదాయ అవుతుందని అన్నారు. జిల్లా మొత్తం మీద 20 బెంచ్‌లను ఏర్పాటు చేయగా, శ్రీకాకుళం జిల్లా కోర్టు ఆవరణతో ఐదు బెంచ్‌లను ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు. కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి బి.సాధుబాబుక, 3వ అదనపు జిల్లా జడ్జి, సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, సీనియర్ డివిజన్ ఆర్.శాంతిశ్రీ, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి కె.హరిబాబు, 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి, మొహిద్దీన్ జమరుత్ బేగం కములుద్దీన్, స్పెషల్ మొబైల్ కోర్ట్ మెజిస్ట్రేట్, వి.సాహితి, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, జూనియర్ డివిజన్ కె.అనురాగ్ , పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అదాలత్‌లలో 12,159 కేసులు పరిష్కారం చేశారు. ఇందులో సివిల్ కేసులు 101, క్రిమినల్ కేసులు 11,97, ప్రిలిటిగేషన్ కేసులు 50, మోటారు వాహన యాక్సిడెంట్ కేసులు 21, కాగా వీటికి గాను రూ.5,95,16,236 వసూలు చేశారు.


