గతంలో ఇదే మాదిరిగా ఇసుక అక్రమ రవాణా జరిగితే సిబ్బందితో పరిశీలన చేయించి ట్రాక్టర్లు పట్టుకున్నాం. ఇప్పుడు రాత్రివేళ లు, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సహకారంతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం.
– రాము, ఇన్‌చార్జి తహసీల్దార్, మెళియాపుట్టి
సిబ్బందిని అప్రమత్తం చేసి ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టడి చేస్తాం. ఇదివరకే మహేంద్ర తనయ నదీ తీరంలో పలుమార్లు మా ఎస్సై, సిబ్బంది కలిసి నిఘా పెట్టారు. ఒడిశాకు ఇసుక తరలించకుండా స్థానికులు, రెవెన్యూ సిబ్బంది సకాలంలో సమాచారం అందించి సహకరించాలి.
– వెంకటరావు, సీఐ, పాతపట్నం


