గార : జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ పోటీలకు గార మండలంలోని బోరవానిపేట పంచాయతీని రాష్ట్రస్థాయిలో నామినేట్ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి తెలిపారు. ఈ మేరకు బోరవానిపేటలో ఎమ్మెల్యే గొండు శంకర్ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ, పాఠశాల, పంచాయతీ కార్యాలయాలకు కావాల్సిన ఫర్నిచర్‌ను వెంటనే అందించాలని సూచించారు. తాగునీరు, కాలువలు, రోడ్డు పనులకు అంచనాలు తయారు చేయాలని ఆదేశించారు.త్వరలోనే కేంద్రం నుంచి ప్రత్యేక బృందం బోరవానిపేట వస్తుందని, అప్పటికల్లా అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్, ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ రమేష్ పాల్గొన్నారు.


