పాలకుల కర్కశం.. బలైన నిండు ప్రాణం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి నిర్దయకు నిదర్శనంగా మరో నిండు ప్రాణం బలైపోయింది. అనారోగ్యంతో ఉన్న ఓ దళిత అధికారిపై కనికరం అన్నదే లేకుండా వ్యవహరించడంతో ఆయన ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. పశు సంవర్ధక శాఖలో టెక్కలి డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేసిన వి.జయరాజ్‌ను కూటమి ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ల తర్వాత పాడేరుకు బదిలీ చేసింది. ఆయనకు అప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయనకు గుండెకు సంబంధించి బైపాస్ సర్జరీ జరిగింది. కరోనాలో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. పైగా నిమోనియాతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యక్తికి ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓ మంత్రికి నచ్చలేదనే ఏకై క కారణంతో ఆయనను ఏకంగా పాడేరుకు బదిలీ చేశారు. బదిలీ వెనక రాజకీయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడికి బదిలీ అయిన తర్వాత కూడా మంత్రిని కలిసి, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తగు ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని ప్రాధేయ పడ్డారు. అయినా ఎవరూ కరుణించలేదు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పాడేరులో పని చేస్తున్న జయరాజ్ శుక్రవారం కార్యాలయంలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలేశారు. కృష్ణా జిల్లాకు చెందిన జయరాజ్ భార్య శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉండటంతో ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సచివాలయాల్లో టీడీపీ నాయకుల హల్‌చల్
ఇచ్ఛాపురం: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సామాజిక పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో సచివాలయాల్లో టీడీపీ నాయకులు హల్‌చల్ చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయాల్లో ఉదయాన్నే టీడీపీ నాయకులు తిష్టవేసుకుని కూర్చుంటున్నారని దరఖాస్తు దారులు చెబుతున్నారు. మున్సిపాలిటీలోని 9,10 వార్డు కార్జి వీధి సచివాలయంలో ఆయా వార్డులకు చెందిన టీడీపీ నాయకులు సచివాల య సిబ్బంది పక్కనే కుర్చీలు వేసుకుని కూర్చుని అధికారుల్లా వ్యవహరిస్తున్నారు. సచివాలయానికి వచ్చిన దరఖాస్తు దారుల వద్ద నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని పరిశీలన చేస్తున్నారు. తమ సూచనలు వచ్చిన తర్వాతే ఆన్‌లైన్ చేయాలని సిబ్బందికి చెబుతున్నారు.
బ్యాంకు ఉద్యోగుల ధర్నా
శ్రీకాకుళం అర్బన్: బ్యాంక్ ఉద్యోగులకు 5రోజుల పనిదినాలు కల్పించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ బి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యూఎఫ్‌బీ యూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోగల డీసీసీబీ బ్యాంక్ నుంచి ర్యాలీగా బయలుదేరి సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం నిర్వహించా రు. అనంతరం సూర్యమహల్ కూడలి నుంచి దీపామహల్ పెట్రోల్ బంక్ వద్ద నున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకూ ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేశారు. శ్రీనివాసులు మాట్లాడుతూ బ్యాంక్ ఉద్యోగుల సమస్యలపై సానుకూల స్పందన లేకపోవడం వల్ల ఈ సమ్మె చేస్తున్నామన్నారు. బ్యాంకుల్లో క్లరికల్, సబ్–స్టాఫ్ నియామకం, కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఎన్‌పీఎస్‌కు బ్యాంక్‌లు ఇచ్చే అదనపు 4శాతం కాంట్రిబ్యూషన్‌పై ఆదాయపు పన్ను మినహాయించాలని కోరారు.
విద్యుత్ ఉత్పత్తి బట్టే..
జిల్లాలో ఈఎల్‌ఆర్ అనివార్యమైంది. విద్యుత్ ఉత్పత్తి బట్టే సప్లైకి అవకాశాలు ఇస్తారు. జనరేషన్ కేంద్రా ల వద్ద జిల్లాకు కేటాయించిన మేరకే సప్లయి జరుగుతుంది. ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా ఆ ప్రభావం గ్రిడ్ మీద పడుతుంది. అందుకే ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనల ప్రకారం వారి మానిటరింగ్ ప్రాప్తికి జిల్లాలో విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అయితే ప్రాసెసింగ్ పరిశ్రమలకు, ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే లోడ్ రిలీఫ్ నుంచి మినహాయింపు ఇస్తున్నాం.
– జీఎన్ ప్రసాద్, ఎస్‌ఈ, విద్యుత్ సర్కిల్
రాత్రి వేళల్లో కోతలు
గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాకాలంలో రాత్రి వేళల్లో విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీంతో మారుమూల వీధుల్లో ఇబ్బందులు పడుతున్నాం. అర్ధరాత్రి సమయాల్లో విద్యుత్ కోతల వల్ల దొంగతనాలు, ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి.
– జి.శ్యామలరావు, ఆదిఆంధ్రావీది, టెక్కలి
అల్లాడిపోతున్నాం..
అప్రకటిత విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్నాం. వేళాపాళా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సరఫరా నిలిపివేస్తున్నారు. అర్ధరాత్రి వరకూ సరఫరా నిలిచిపోతోంది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – పెనుమజ్జి పద్మావతి,
యంబరాం, ఎల్‌ఎన్‌పేట
ఘోరంగా ఉంది
విద్యుత్ సరఫరా పరిస్థితి ఘోరంగా ఉంది. సిబ్బంది ని అడుగుతుంటే ఈఎల్‌ఆర్ అని చెబుతున్నారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. చాలా ఇబ్బందులుపడుతున్నాం. – కరణం శివరాం,
పిండ్రువాడ, హిరమండలం
కోతలతో అవస్థలు
వేళాపాళా లేకుండా కరెంటు తీసేస్తున్నారు. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. గత వా రం రోజులుగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ విద్యుత్ సరఫరా ఈఎల్‌ఆర్ పేరిట నిలిపేస్తున్నారు.
– దామ మన్మధరావు, పాగోడు, జలుమూరు మండలం
అరసవల్లి:
కష్టకాలంలో చేతలు చూపాల్సిన సర్కారు కోతలు చూపిస్తోంది. వేసవిలో విద్యుత్ కోతలు సర్వ సాధారణం. కానీ వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు విధిస్తున్నారంటే ప్రభుత్వ సమర్థత అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి దుస్థితి విద్యుత్ శాఖలో గతంలో ఎన్నడూ చూడలేదన్న చర్చ ఆ శాఖలోనే జోరుగా సాగుతుంది. దీనికితోడు వెనుకబడిన జిల్లా కావడంతో విద్యుత్ అందించే పంపిణీ సంస్థలకు కూడా జిల్లాపై చిన్నచూపే కనిపిస్తోంది. ఇతర జిల్లాలతో పోల్చితే సరఫరా కూడా డిమాండ్ మేరకు సప్లై ఇవ్వడం లేదన్న ది అధికారిక లెక్కలే రుజువు చేస్తున్నాయి.
నాలుగేసి గంటలు పాటు కోతలే
విద్యుత్ ఉత్పత్తి తగ్గిందన్న కారణాలు చూపించి జిల్లాలో విద్యుత్ కోతలకు అధికారులు చర్యలకు దిగారు. ఎన్నడూ లేని విధంగా వర్షాకాలం సీజన్‌లో కూడా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్‌ఆర్) పేరిట విద్యుత్ కోతలు అధికమయ్యాయి. ఏకంగా రూరల్ ప్రాంతా ల్లో చాలా ఫీడర్లలో పీక్ లోడ్ అవర్స్‌లో విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తున్నా రు. అలాగే రెండు మూడు దఫాలుగా నాలుగు గంటలుగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ఇక పట్టణాల్లో అయితే విద్యుత్ వినియోగం దృష్టిలో ఉంచుకుని రెండు గంటల పాటు జిల్లా కేంద్రంలో కూడా పగటి పూట రెండు గంటలు, రాత్రి వేళల్లో చిన్నపాటి గా లులకు, వర్షాల పేరిట మరో గంట నుంచి గంటన్నర వరకు విద్యుత్ దఫదఫాలుగా కోత లు విధిస్తున్నారు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిరసనలకు దిగుతున్నారు.
జిల్లాకు రోజుకు 100 మెగావాట్లు లోటు
జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో ఎల్‌టీ విద్యుత్ వినియోగదారులు (గృహాలు) 8,07,794, హెచ్‌టీ విద్యుత్ వినియోగదారులు 504 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో పారిశ్రామిక రంగంతో పాటు తయారీ రంగం, ఎమర్జెన్సీ విభాగాలు ఉన్నా యి. అయితే విద్యుత్ డిమాండ్ పరంగా ఉత్పత్తి కేంద్రాల నుంచి పంపిణీ సంస్థల ద్వారా జిల్లాకు రోజుకు గరిష్టంగా 420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అవసరం కాగా.. ప్రస్తుతం గత వారం రోజుల నుంచి రోజుకు కేవలం 320 వరకు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో విద్యుత్‌ను అందించలేని పరిస్థితులు తలెత్తాయి. ఏకంగా రోజు కు సుమారుగా 100 మెగావాట్లు విద్యుత్ తగ్గి రావడంతో అడ్జస్ట్‌మెంట్ విధానంలో ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరిట విద్యుత్ కోతలతో నెట్టుకొస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
జిల్లాపై చిన్నచూపా..
అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచబోమని, కోతలే ఉండవని ప్రకటనలు గుప్పించిన వారు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన వేసవిలో సరిపడా విద్యుత్ అందించలేక కోతలు విధించిన కూటమి సర్కారు వర్షాకాలంలో కూడా ఈఎల్‌ఆర్ పేరిట విద్యుత్ కోతలు మొదలుపెట్టేశారు. మన జిల్లాకు విద్యుత్ పరంగా చాలా అన్యాయమే జరుగుతోంది. కోనసీమ, విశాఖ జిల్లాలతో పోల్చితే మన విద్యుత్ డిమాండే తక్కువ. కోనసీమలో రోజుకు డిమాండ్ 900 మెగావాట్లు కాగా.. విశాఖలో 1300 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉంది. అయితే వాటితో పోల్చితే మన జిల్లాకు 420 నుంచి 450 మెగావాట్ల వరకు మాత్రమే డిమాండ్ ఉంది. అయితే అందులో కూడా వంద మోగావాట్ల వరకు తగ్గించి సరఫరా చేయడంపై చిన్నచూపు స్పష్టమవుతోంది.
వారం రోజులుగా ఈఎల్‌ఆర్ పేరిట విద్యుత్ కోతల విధింపు
వర్షాకాలంలో కూడా ఇలాంటి కోతలతో కూటమి ప్రభుత్వం రికార్డు
విద్యుత్ సప్లై విషయంలోనూ జిల్లాపై చిన్నచూపు


