జలుమూరు: సాధారణ గర్భినుల వివరాలతోపాటు హైరిస్క్ గర్భిణుల వివరాలను ఆర్‌సీహెచ్ పోర్టల్ లో విధిగా నమోదు చేయాలని జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌ఓ తాడేల శ్రీకాంత్ అన్నారు. గురువారం జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ నెల 11 నుంచి 24 వరకు జరగనున్న ఎల్‌సీడీసీ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అనుమానిత కేసులను పీహెచ్‌సీకి తరలించి వైద్యపరీక్షలు చేసి మందులు అందించాలన్నారు. అనంతరం ప్రపంచ ఆత్మహత్య ల నివారణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి అహల్య, పీహెచ్‌ఎన్ కె.పద్మావతి, హెల్త్ సూపర్‌వైజర్ చినరాజులు, సిబ్బంది విజయశాంతి, చిన్నారావు, రాజారావు, అప్పలరాజు, లత తదితరులు పాల్గొన్నారు.


