కలెక్టర్ల సదస్సుకు హాజరు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్ల సదస్సుకు హాజరు

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

కలెక్టర్ల సదస్సుకు హాజరు ఆత్మహత్యలు లేని సమాజమే లక్ష్యం పనులు వేగవంతం చేయాలి వలస మత్స్యకారుడు మృతి టిక్కేటుగాళ్లపై ఆరా

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: అమరావతిలో గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో జిల్లా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పాల్గొన్నారు. అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్‌ ల్యాండ్‌ బ్యాంక్‌ పోర్టల్‌ను తయారు చేయాలని, ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్‌ స్పష్టమైన యాక్షన్‌ క్యాలెండర్‌ను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఎచ్చెర్ల: ఆత్మహత్యలు లేని సమాజాన్ని నిర్మించడానికి అందరూ కృషి చేయాలని జిల్లా వైద్యా రోగ్యశాఖాధిరి ఐవీవీఎన్‌ నరేష్‌కుమార్‌ అన్నా రు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్స వం సందర్భంగా ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో ఏటా 1,70,746 మంది ఆత్మహ త్య చేసుకుంటున్నారని, అందులో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్నవారే ఎక్కువని చెప్పా రు. మనకు తెలిసిన వారు ఆర్థిక, శారీరకపరమైన ఇబ్బందుల్లో ఉంటే అండగా నిలవాలన్నా రు. మానసిక సమస్యలతో బాధపడుతుంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 14416కు సంప్రదించాలన్నా రు. కార్యక్రమంలో జిల్లా అధికారి రజనీ, వైద్యాధికారులు ఉషశ్రీ, గంగాప్రియదర్శిని, నాగోజీ, వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం: ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న అన్ని ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాల ని సీతంపేట ఐటీడీఏ పీవో పవార్‌ స్వప్నిల్‌ అధికారులను ఆదేశించారు. గురువా రం పాతపట్నం సబ్‌ డివిజన్‌ కార్యాలయంలో ఇంజినీరింగ్‌ అధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లా డుతూ గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న రహ దారులు, భవన నిర్మాణాల పనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించా రు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. అనంతరం ఇటీవల మరమ్మతులు చేసిన సబ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని పీవో ప్రారంభించి ఆవరణలో మొక్క నాటా రు. కార్యక్రమంలో ఈఈ రమాదేవి, డీఈఈ నాగభూషణ్‌, సిమ్మన్న పాల్గొన్నారు.

ఎచ్చెర్ల : బడివానిపేటకు చెందిన వారధి మహందాత (52) అనే మత్స్య కారుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో గురువారం మృతి చెందాడు. తోటి మత్స్యకారులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తిరిగి వస్తుండగా బోట్‌లోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

శ్రీకాకుళం క్రైమ్‌: ఐఆర్‌సీటీ పేరుతో నకిలీ పీడీఎఫ్‌ రిజర్వేషన్‌ టికెట్లను ప్రయాణికులకు విక్రయించి మోసగిస్తున్న ఇంటర్నెట్‌ సెంటర్ల ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచినట్లు సమాచారం. గురువారం ‘సాక్షి’లో ‘టిక్కేటుగా ళ్లు’ పేరిట ప్రచురితమైన కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు సిబ్బందిని జిల్లాలోని కీలక రైల్వేస్టేషన్ల పరిధిలో ఉన్న సెంటర్ల వద్దకు వెళ్లి ఆరా తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement