శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీ ల్లో జిల్లా జట్లు తుది వరకు పోరాడి విజయాలతో తిరిగి రావాలని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా బొబ్బిలి వేదికగా ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి (అంతర్ జిల్లాల) సబ్–జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ చాంపియన్‌షిప్–2026 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు గురువారం ఇక్కడి నుంచి పయనమై వెళ్లాయి. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శ్రీను మాట్లాడుతూ క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబర్చి ట్రోఫీలు సాధించి జిల్లాకు, కోచ్‌లకు, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రపోటీల కు వెళ్లేందుకు జిల్లా క్రీడాకారుల బృందానికి అవసరమైన ఆర్థిక సాయం అందజేశారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి జి.వి.సత్యనారాయణ, అతని సోదరుడు అప్పలాచారి సంయుక్తంగా క్రీడాకారు లు, కోచ్ మేనేజర్లతో కలిసి 40 మందికి క్రీడా దుస్తు లు అందజేశారు. క్రీడాకారులకు సహాయ సహకారాలు అందించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రా ష్ట్ర కన్వీనర్ మొజ్జాడ వెంకటరమణ స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరా వు, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మెట్ట తిరుపతిరావు, అసోసియేషన్ సభ్యులు ఢిల్లీశ్వరరావు, ఆనంద్‌కిరణ్, రాజగోపాల్, శ్రీనివాసరా వు, హరికృష్ణ, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
నరసన్నపేట: స్థానిక మెయిన్ రోడ్డుపై జామియా మసీదు ఎదురుగా ఆటో అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో రేగుపాటి రాజారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కోటబొమ్మాళి నుంచి నరసన్నపేట వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో ముందు భాగంలో కూర్చున్న రాజారావుకు గాయాలవ్వడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.గణేష్ తెలిపారు.


