ఆన్‌లైన్ అనుమతులు కోసం సంప్రదించాల్సినవి
● అధిక శబ్ద కాలుష్యానికి కారణమయ్యే స్పీకర్లు, సౌండ్ సిస్టమ్‌లను ఉపయోగించరాదు.
● సాధారణ స్పీకర్లను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు వినియోగించాలి.
● నిమజ్జన ఊరేగింపు సమయంలో అధిక శబ్ధంతో డీజేలు వినియోగించరాదు.
● నిమజ్జనం సమయంలో అశ్లీల నృత్యాలు నిర్వహించరాదు.
● గణేష్ మండపాల వద్ద ఊరేగింపుల సమయంలో బాణాసంచా వాడరాదు.
● ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా బలవంతపు చందాలు, విరాళాలు వసూలు చేయకూడదు.
● దర్శనాలకు టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేయరాదు. ఇలాంటివి చేస్తే డయల్ 112 కు లేదా వాట్సాప్ నంబర్‌కు 6309990933 సమాచారమివ్వాలి.
● ప్రతి గణేష్ మండపానికి సంబంధిత పోలీస్‌స్టేషన్ నుంచి ఓ పోలీస్ సిబ్బందిని కో ఆర్డినేటర్‌గా నియమిస్తాం. నిర్వాహకులు సమన్వయం చేసుకోవాలి.
శ్రీకాకుళం క్రైమ్ : వినాయక చవితిని పురస్కరించుకుని జిల్లాలో వినాయక విగ్రహాల మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో అనుమతులు పొంందాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శనివారం స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన సింగిల్‌విండో విధానం ద్వారా ఉత్సవాల నిర్వహణ, ఊరేగింపులు, నిమజ్జనానికి అవసరమైన అనుమతులను పొందాలన్నారు. ఉత్సవ నిర్వాహకులు కమిటీగా ఏర్పడి జిఎఎన్‌ఈస్‌హెచ్‌యుటిఎస్‌ఎవి.ఎన్‌ఈటీ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నిర్దేశిత వివరాలను నమోదు చేయాలని, ఇలా చేసుకుంటే పోలీస్, అగ్నిమాపక, మున్సిపాలిటీ, విద్యుత్, రెవెన్యూ శాఖల అనుమతులు ఒకే వేదికపై సమన్వయం చేస్తూ అనుమతులు మంజూరవుతాయని, అన్ని నిబంధనలు, భద్రతా ప్రమాణాలను పాటించిన మండపాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ ఎన్‌ఓసీ జారీ చేస్తామన్నారు.
కమిటీ సభ్యులు సంబంధిత పోర్టల్‌లో అప్లికేషన్ స్టేటస్ నేవిగేట్ అయ్యి దరఖాస్తుదారుని ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేస్తే అనుమతులు మంజూరు చేస్తూ నిరభ్యంతర పత్రం, పాటించాల్సిన నిబంధనలతో కూడిన క్యూఆర్ కోడ్ డౌన్‌లోడ్ అవుతుందని, జారీ చేసిన డిజిటల్ ఎన్‌ఓసీని స్పష్టంగా మండపం వద్ద ప్రదర్శించాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
కమిటీ సభ్యుల ఆధార్ వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్లు.
ఏర్పాటు చేయనున్న గణేష్ విగ్రహం బరువు, ఎత్తు.
మండపాలు ఏర్పాటు చేసే ప్రదేశం, ఉత్సవాలు నిర్వహించే పూజా దినాలు.
నిమజ్జనం నిర్వహించే తేదీ, సమయం.
నిమజ్జనం కోసం నిర్ణయించిన ఊరేగింపు మార్గం.
నిమజ్జనానికి ఉపయోగించే వాహనం, డ్రైవర్‌కు సంబంధించిన వివరాలు.
చలానాలు కట్టక్కర్లేదు
నిబంధనలు పాటించిన మండపాలకు క్యూఆర్‌కోడ్‌తో కూడిన డిజిటల్ ఎన్‌ఓసీ జారీ
గణేష్ ఉత్సవ్.నెట్ వెబ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందే వీలు
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి


