అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఉత్సవాల్లో కీలక ఘట్టమైన ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని శనివారం సాయంత్రం స్థానిక కృష్ణాష్ట మి మండప ఆవరణలో నిర్వహించారు. ఆల య ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మల ఆధ్వర్యంలో శ్రీ ఉషా పద్మి ని ఛాయా దేవేరులతో శ్రీ వారి ఉత్సవ మూర్తులను వెండి సింహవాహనంలో ఊరేగింపుగా తీసుకువచ్చి స్థానిక ఉత్సవ మండపంలో వేంచేసింపజేశారు. అనంతరం ఉట్టి కొట్టే ప్రక్రియను ప్రారంభించారు. స్థానిక యు వత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉట్టిని కొట్టేందుకు ఉత్సాహం చూపించారు.


