జీతాలు చెల్లించాలంటూ నిరసన | - | Sakshi
Sakshi News home page

జీతాలు చెల్లించాలంటూ నిరసన

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

సంతబొమ్మాళి: మూలపేట పోర్టులో పనిచేస్తు న్న సిబ్బంది జీతాలు తక్షణం చెల్లించాలంటూ గురువారం నిరసన చేపట్టారు. మూడు నెలల జీతాల చెల్లింపు విషయమై యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో నిరసనను సిబ్బంది కొనసాగిస్తున్నారు. జీతాలు చెల్లించకుండా సిబ్బందిని తొలగించాలని యాజమా న్యం చూస్తోందని వారు ఆరోపించారు. మూ డు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబాల పరిస్థితి ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. అలాగే జీతాలు చెల్లించే వరకు నిరసన కొనసాగిస్తామని వారు హెచ్చరిస్తూ నినాదాలు చేశారు.

విద్యాశాఖ మంత్రి మొండి వైఖరికి నిరసనగా ఆందోళన ఉద్ధృతం

నరసన్నపేట: ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు విషయంలో వి ద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ సరైన పద్ధతిలో స్పందించడం లేదని, ఆయన వైఖరికి నిరసనగా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన ఉద్ధృతం చేస్తున్నామని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లండ బాబూరావు, బమ్మిడి శ్రీరామమూర్తి తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి విజయవాడ అలంకార్‌ థియేటర్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్షలు చేయనున్నామని ప్రకటించారు. విద్యా శాఖ మంత్రి ఇదే పద్ధతి కొనసాగిస్తే ఆందోళనలు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో కూడా చేపడతామని హెచ్చరించారు.

ఉపాధి కోర్సులకు ప్రాధాన్యం

ఎచ్చెర్ల: పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉద్యో గ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కోర్సులను రూపొందించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కేఆర్‌ రజని తెలిపారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీ పరిపాలనా భవనంలో గురువారం వర్సిటీ విభాగాల బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఉన్నత విద్యా మండలి మార్గ దర్శకంతో వర్సిటీ కోర్సులు, పాఠ్యాంశాల్లో మార్పులు చేస్తోందని అన్నారు. నిరుద్యోగ యువత ప్ర యోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి ఉపాధి అవకాశాలు కల్పించే రంగాల్లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజె న్స్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ ఆధారిత కోర్సులను రూపొందించడం వల్ల విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అన్నారు. రిజిస్ట్రార్‌ బి.అడ్డయ్య మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్‌ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement