ఏపీ బ్యాడ్మింటన్‌ జట్టు మేనేజర్‌గా రాజు | - | Sakshi
Sakshi News home page

ఏపీ బ్యాడ్మింటన్‌ జట్టు మేనేజర్‌గా రాజు

Sep 4 2026 1:54 AM | Updated on Sep 4 2026 1:54 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: సౌత్‌జోన్‌ నేషనల్స్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బృందానికి మేనేజర్‌గా జిల్లాకు చెందిన డాక్టర్‌ గురుగుబెల్లి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పి.అంకమ్మ చౌదరి నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు బెంగళూరు వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. రాజు జిల్లాలోని పాతపట్నం సబ్‌–రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌లో క్రియాశీలక పాత్రపోషిస్తున్నారు. ఇప్పటికే అనేక జాతీయ బ్యాడ్మింటన్‌ పోటీల్లో రాష్ట్ర జట్లకు మేనేజర్‌గా వ్యవహరించారు. రాజు నియామకం పట్ల జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘ అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్‌, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్‌, చీఫ్‌ పేట్రన్‌ డాక్టర్‌ గూడేన సోమేశ్వరరావు, సీఈఓ సంపతిరావు సూరిబాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఎన్‌.వి.కిరణ్‌కుమార్‌, గురుగుబెల్లి ప్రసాద్‌, గోరా అనిల్‌, దామోదర్‌, శైలానీ, రత్నాజీ, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement