మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిత్రంలో బూడి ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, పిరియా విజయ, రెడ్డి శాంతి, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఎంవీ పద్మావతి, మామిడి శ్రీకాంత్, ఎన్ని ధనుంజయ్, దుంపల లక్ష్మణరావు, కిల్లి సత్యన్నారాయణ, కరిమి రాజేశ్వరరావు తదితరులు
సభకు హాజరైన పార్టీ కార్యకర్తలు, నాయకులు
ప్రశ్నించడమే మన కర్తవ్యం
టౌన్‌హాల్ మనందరికీ పార్టీ కార్యాలయంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే మన కర్తవ్యం. ఆర్టీఐ ద్వారా సమాచారం తెలుసుకుని వారి తాట తీయాలి. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకత వైఎస్ జగన్ పర్యటనతో తేటతెల్లమైంది. నాకు టికెట్ వచ్చినా రాకున్నా పార్టీని వీడే ప్రసక్తే లేదు. ఆరుగురు మత్స్యకారుల గృహ ప్రవేశాలకు వెళ్తే దానిపై హౌసింగ్ పీడీ చేత కేసులు పెట్టించడం దారుణం. అసలు కలెక్టర్ అన్నీ తెలిసే చేస్తున్నారా.? కేసు పెట్టిన 12 గంటల్లోనే కొట్టేశారు. కలెక్టర్ స్థాయి వ్యక్తి అంత దిగజారి ఉద్యోగం చేయడం అవసరమా? గృహ ప్రవేశాలకు, ఇనాగిరేషన్‌కు తేడా తెలీని వారు అధికారులుగా ఉండడం మన దౌర్భాగ్యం. నన్నెందుకు జైల్లో వేస్తారు. జిల్లాకు రోడ్లు వేశాననా, రైతులకు నీరిచ్చాననా, రిమ్స్ కట్టాననా, అభివృద్ధి చేశానని నన్ను జైల్లో పెడతారా. చంద్రబాబు రైతు భరోసా, నేతన్న నేస్తం, మత్య్సకార భరోసా, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటివి ఎగ్గొట్టి ధరలు మూడింతలు పెంచారు. రైతులకు నీరు లేదు, ఎరువు లేదు, పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి ఎవరూ భయపడరు. స్థానిక సంస్థల్లో మనం పోటీ చేయాల్సిందే.
– ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ):
సీదిరి అప్పలరాజును జైల్లో పెట్టినప్పుడు శ్రీకాకుళం జిల్లాకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బయల్దేరిన నాడే పార్టీ గెలుపునకు బాటలు పడ్డాయని వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఆనాడు వైజాగ్ నుంచి శ్రీకాకుళంలోని అంపోలు జైలు వద్దకు వెళ్లేందుకు ఆరు గంటలు పట్టిందంటే వైఎస్ జగన్‌పై జనాభిమానం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. శ్రీకాకుళం నగరంలో జిల్లా పార్టీ కార్యాలయం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
ముందుగా జీటీ రోడ్డు వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ ర్యాలీ గా పాతబస్టాండ్ మీదుగా టౌన్‌హాల్ వద్దకు చేరుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయం అన్ని చాంబర్‌లు లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యద ర్శి గేదెల పురుషోత్తం సతీసమేతంగా హోమం చే యించి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ 2029 ఎన్నికల విజయానికి టౌన్‌హాల్ వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. చంద్రబాబు అ ధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగిపోయాయని, కిలో పంచదార రూ.40 నుంచి రూ.75కి చేరడం దారుణమన్నారు. అప్పట్లో ధర్మాన మంత్రిగా తన ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన క్రమశిక్షణను చూసి తనకు రాజకీయాల్లోకి రావాలని అనిపించిందని అన్నారు.
సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయసాయిరాజ్, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, పెనుమత్స సురేష్‌బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు, మహిళావిభాగం నాయకులు ఎంవీ పద్మావతి, పార్టీ ముఖ్య నాయకులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, కేవీజీ సత్యనారా యణ, ఎన్ని ధనుంజయరావు, అంబటి శ్రీనివాసరావు, చల్ల రవికుమార్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయికుమార్, గేదెల పురుషోత్తం, చింతా డ వరుణ్‌కుమార్, పిల్లల రామకృష్ణ, ఉలాల దివ్య భారతి, రుప్ప దివ్య, ఆరంగి లక్ష్మీపతీ, కొర్ల భారతి, పొన్నాడ రుషి, శిమ్మ రాజశేఖర్, ఎం.ఏ భేగ్, ముంజేటి కృష్ణ, మార్పు పృథ్వీ, ముత్తా విజయ్‌కుమార్, నర్తు నరేంద్రయాదవ్, ప్రత్తి అన్వేష్, గొండు కృష్ణమూర్తి, కోణార్క్ శ్రీను, డాక్టర్ శ్రీనివాసపట్నాయక్, బొడ్డేపల్లి రమేష్‌కుమార్, సాదు వైకుంఠరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పీస శ్రీహరి, గంట్యాడ రమేష్, గద్దిబోయిన కృష్ణయాదవ్, ఎంఏ రఫీ, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, సనప ల నారాయణరావు, మండవల్లి రవి, తంగుడు నాగేశ్వరరావు, కోట గోవిందరావు, మొదవలస చిరంజీవి, రౌతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ జగనే అండ
చంద్రబాబు గెలుపు అంతా వెన్నుపోటుతో వచ్చినదే. ఆ పార్టీకి వెన్నుపోటు పార్టీ అని పేరు పెడితేనే బాగుంటుంది. పార్టీలో ఎవరికి కష్టం వచ్చినా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అండగా ఉంటారు. దానికి నేనే సాక్ష్యం. అధికార దాహంతో అనేక అబద్ధపు హామీలివ్వడం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ విస్మరించడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య.
– సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
భయపడేదే లేదు..
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తే భయపడిపోతామని అనుకుంటున్నారు. అది కూటమి నేతల అవివేకం. 2019 ఎన్నికల కంటే మిన్నగా 2029 ఎన్నికల్లో ఫలితాలు తీసుకొచ్చేందుకు మనందరం కృషి చేయాలి. వైఎస్సార్‌సీపీకి చెందిన 800మంది సోషల్ మీడియా వ్యక్తులపై కేసులు పెట్టారు. వారికి పార్టీ అండగా నిలబడింది. ప్రతి కేసుపై ప్రతిస్పందన కచ్చితంగా ఉంటుంది. – హర్షవర్ధన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి (కో–ఆర్డినేషన్)
విజయ దుందుభి మోగిద్దాం
టౌన్‌హాల్ వేదికగానే అనేక విజయాలు సాధించాం. 2029లో మళ్లీ విజయ దుందుభి మోగిద్దాం. వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం, రూ.265కోట్లుతో పాతపట్నం నియోజకవర్గంలో తాగునీరు, రూ.750కోట్లుతో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, పలాస కిడ్నీ ఆస్పత్రి, మూలపేట పోర్టు వంటి అనేక అభివృద్ధి పనులు చేసిన ఘనత వైఎస్ జగన్‌ది. పథకాలు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుది.
– రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే
పార్టీని గెలిపిద్దాం
జిల్లాలో మనకు మంచి నాయకత్వం ఉంది. రానున్న మూడేళ్లు కష్టపడి పనిచేసి పార్టీని గెలిపించుకోవాలి. పలాస, ఆమదాలవలస నియోజవర్గాల నాయకులు సీదిరి అప్పలరాజు, చింతాడ రవికుమార్‌కు పార్టీ అండగా నిలబడిన తీరు అందరికీ ధైర్యాన్నిచ్చింది.
– సాడి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, పార్టీ ఇచ్ఛాపురం సమన్వయకర్త
కలిసికట్టుగా ముందుకెళ్దాం
స్థానిక ఎన్నికల్లో కలిసికట్టుగా ముందుకెళ్తే విజయం మన సొంతం. సమర్థులు అవకాశం వచ్చినప్పుడు పార్టీని గెలిపించాలి. ప్రతి గ్రామంలో తటస్థులను కలుపుకుని వెళ్లాలి. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌సీపీ పోటీ చేయాలి. ఎవరికీ భయపడేది లేదు. రానున్న 2029 ఎన్నికల్లో గెలుపుజెండా టౌన్‌హాల్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఎగురవేద్దాం.
– ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు
మోసకారి పాలన
చంద్రబాబుది మోసకారి పాలన. 2029 ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిపించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలన్నదే మనందరి లక్ష్యం. కూటమి పాలకుల మోసాలు అందరికీ వివరించాలి
– పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త
ఒకే బాటలో నడుద్దాం
అందరం ఒకే బాటలో నడుద్దాం. ఆశావహులకు తగు సూచనలు, సలహాలిచ్చి బరిలో దిగేలా పార్టీ పెద్దలు చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలే అసెంబ్లీ ఎన్నికలకు పునాదులవుతాయి.
– గొర్లె కిరణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే
కేసులకు బెదిరేది లేదు
ఎస్పీ రాజ్యాంగబద్ధంగా కాకుండా చంద్రబాబు తొత్తులా పనిచేయడం సరికాదు. ఓ మహిళా ఎస్‌ఐని సుపారి గ్యాంగ్‌తో చంపేయాలని చూశామని 13 సెక్షన్లు కింద 13 కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇలాంటి కేసులకు భయపడిపోతామని అనుకోవడం కూటమి నేతల భ్రమ. కూన రవికుమార్ ఏకంగా ఆ ఎస్‌ఐను ఇమిటేట్ చేసి కించపరచడం ప్రజాప్రతినిధిగా సరికాదు. వైఎస్ జగన్ మనకు అండగా ఉన్నారు. – చింతాడ రవికుమార్, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త
ఇది గెలుపు ముహూర్తం
ఇది పార్టీ కార్యాలయానికి పెట్టిన ముహూర్తం కాదు.. 2029లో గెలుపునకు పెట్టిన ముహూర్తం. ఎన్ని కష్టాలు, నష్టాలున్నా అలుపెరగని పోరాటం చేస్తున్నది పార్టీ కార్యకర్తలే. ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టినా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది.
– ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, పార్టీ యువనేత
కార్యకర్తలకు గుర్తింపు
జగన్ 2.0లో కార్యకర్తలకు తగిన న్యాయం, గుర్తింపు లభిస్తుంది. మనందరిదీ వైఎస్సార్‌సీపీ కుటుంబం. ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తప్పవు.
– ధర్మాన కృష్ణచైతన్య, పోలాకి జెడ్పీటీసీ
సిక్కోలుకి వైఎస్ జగన్ వచ్చిన రోజే గెలుపు ఖాయమైపోయింది: బూడి ముత్యాలనాయుడు
ప్రతి పంచాయతీలో పోటీ చేద్దాం: ధర్మాన ప్రసాదరావు
ప్రణాళికాబద్ధంగా ఎన్నికలకు వెళ్దాం: ధర్మాన కృష్ణదాస్
టీడీపీ కాదు అది వెన్నుపోటు పార్టీ: సీదిరి అప్పలరాజు
కార్యకర్తల పార్టీ వైఎస్సార్‌సీపీ: హర్షవర్ధన్‌రెడ్డి
సందడిగా వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయం
ప్రారంభోత్సవం
భారీగా తరలి వచ్చిన పార్టీ నాయకులు


