మందస: మండలంలోని కొత్తపల్లి జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి చెందిన కొత్తపల్లి కాంతారావు(43) కంచిలి నుంచి పలాసకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు తీవ్రగాయాలతో ఉన్న కాంతారావును హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన అనంతరం 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అయితే మార్గమధ్యలో అతను మృతి చెందారు. కాంతారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంచిలి మండలంలో ఉన్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో మాస్టర్‌గా పనిచేస్తున్నారు. మందస పోలీసులు కేసు నమోదు చేశారు.


