ఉపాధ్యాయురాలు నీరజకు ప్రశంసలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలు నీరజకు ప్రశంసలు

Aug 31 2026 1:32 AM | Updated on Aug 31 2026 1:32 AM

శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని ఎ.వి.ఎన్‌(వరం) మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తిమ్మరాజు నీరజ ప్రతిభ కనబరిచారు. ఫిన్లాండ్‌ తుర్క్‌ యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యాభివృద్ది ప్రతినిధులు సంజాయ్‌, సారి ఐసో క్యోటో, సువి పువోలక్క చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు ఫిన్లాండ్‌లోని తుర్క్‌ యూనివర్సిటీలో నిర్వహించిన ఈ విజిట్‌లో జాయ్‌ అండ్‌ ప్లే వినూత్న పద్ధతుల ద్వారా పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్ధాయి విద్యలో వృత్తిపరమైన శిక్షణ ఇవ్వడం, కర్క్యులం, సంస్కరణలు తదితర అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులకు విద్యాభోధనలో వారు చేస్తున్న వినూత్న పద్థతులను పరిశీలించామని నీరజ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement