రణస్థలం: బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఓ పరిశ్రమ నుంచి వెలువడుతున్న ధూళి, బూడిదతో ఇబ్బందులు పడుతున్నామని పరిసర ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లటి బూడిద ఇళ్లపైన, నీళ్లలోనూ, తినే ఆహా రంలో పడుతోందని, సమీప వాణిజ్య పంటలకు సైతం నష్టం వాటిల్లుతోందని వాపోయా రు. వాహనచోదకుల కళ్లలో పడి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. ఈ విఫయమై కాలుష్య నియంత్రణ అధికారి కుసుమశ్రీ వద్ద ప్రస్తావించగా, గతంలో పరిశ్రమకు షోకాజ్ నోటీస్ జారీ చేశామని, మరల పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


